
విజయనగరం: విజయనగరం మండలం ద్వారపూడి గ్రామంలో ఆదివారం జరిగిన విషాదకర సంఘటనలో నలుగురు చిన్నారులు మృతిచెందారు. ఆడుకోవడానికి బయటకు వెళ్లిన చిన్నారులు తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పలు గంటల వెతుకుల అనంతరం గ్రామంలోని మహిళా మండల కార్యాలయం వద్ద నిలిపివున్న కారు లోపల చిన్నారుల మృతదేహాలు గుర్తించారు.
సరదాగా ఆ కారులోకి ప్రవేశించిన చిన్నారులు డోర్ వేసిన వెంటనే తాళం పడిపోయింది. కారులో ఆక్సిజన్ లేక ఊపిరాడక మృతిచెందిన వారు:
మంగి బుచ్చిబాబు, భవాని దంపతుల కుమారుడు ఉదయ్ (8)
బుర్లు ఆనంద్, ఉమా దంపతుల కుమార్తెలు చారుమతి (8), చరిష్మా (6)
కంది సురేష్, అరుణ దంపతుల కుమార్తె మనస్విని
ఈ విషాద ఘటనపై గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.
