తెలంగాణలో బీజేపీ బలపడుతోంది – కాంగ్రెస్‌కు గుణపాఠం
తెలంగాణ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పార్టీ విజయాన్ని ‘ఛాంపియన్ ట్రోఫీ’గా అభివర్ణించారు. కాంగ్రెస్ ఒక వర్గానికి కొమ్ము కాస్తూ హిందూ సమాజాన్ని విస్మరించిందని, అందుకే ప్రజలు వారిని ఖండించారని పేర్కొన్నారు.
బీజేపీ గెలుపుపై సంజయ్ హాట్ కామెంట్స్
“ఒక వర్గాన్ని ఒడిసిపట్టుకున్న కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పారు”
“హిందూ సమాజం ఇచ్చిన ‘‘రంజాన్ గిఫ్ట్’’ ఇది!”
“డబ్బులు పంచి గెలుస్తామని భావించిన కాంగ్రెస్‌కు ఓటర్లు చెంపచెల్లుమనిపించారు”
“నోట్లు పంచిన వాళ్ల గూగుల్ పే లెక్కలన్నీ తీస్తాం – ఎవరినీ వదిలిపెట్టం”
“కాంగ్రెస్‌పై యుద్ధ భేరి మోగిస్తున్నాం – దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు తక్షణమే నిర్వహించండి”
బీజేపీ కార్యకర్తల పోరాటాలకు హ్యాట్సాఫ్
బీజేపీ విజయం వెనుక పార్టీ కార్యకర్తల అహర్నిశ శ్రమ ఉందని బండి సంజయ్ ప్రశంసించారు. “ప్రదర్శనలు, అరెస్టులు, లాఠీచార్జీలు ఎదుర్కొన్నా వెనక్కి తగ్గని కార్యకర్తలందరికీ హృదయపూర్వక వందనాలు” అని తెలిపారు.
కాంగ్రెస్-బీఆర్ఎస్ కుట్రలు విఫలం
కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసికట్టుగా బీజేపీని ఓడించేందుకు కుట్రలు పన్నారు. భారీగా డబ్బు పంపిణీ చేశారు. “వారు ఓటుకు రూ.5 వేల చొప్పున యూపీఐ ద్వారా పంపిణీ చేశారు. కానీ ప్రజలు ఆ కుట్రలను తిప్పికొట్టారు” అని సంజయ్ తెలిపారు.
బీజేపీ విజయ పరంపర కొనసాగుతుంది
“ఇకపై ఏ ఎన్నికలు జరిగినా బీజేపీదే గెలుపు” అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభంజనం సృష్టిస్తుందని తెలిపారు.
“ఇదే కేవలం ట్రైలర్ – అసలు చిత్రం ఇంకా మిగిలే ఉంది!”
