చెత్తకుండిలో కాదు… ఊయలలో భద్రత
జమ్మికుంట ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం “ఊయల – క్రెడిల్ బేబీ రిసెప్షన్ సెంటర్” పథకాన్ని జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు ప్రారంభించారు.
హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ చందు, ఆసుపత్రి సూపరిండెంట్ శ్రీకాంత్ రెడ్డి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ చందు మాట్లాడుతూ – పసిపిల్లలను చెత్తకుండీల్లో వేయకుండా, మానవత్వంతో ఆలోచించి ఊయల కేంద్రాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.
ప్రభుత్వం అనాధ శిశువులకు ఆశ్రయం కల్పిస్తుందని, పిల్లలను నేరుగా అప్పగించదలచిన వారు
94908 81098 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు అభ్యున్నతి అధికారి, హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ గౌడ్,
ఐసీడీఎస్ సిబ్బంది, ఆరోగ్యశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.

