పెబ్బేరు, జూన్ 5 (జిందగీ9న్యూస్): పెబ్బేరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో, వనపర్తిలోని శ్రీ సాయి నేత్రాలయ కంటి ఆసుపత్రి సహకారంతో, ఉచిత కంటి వైద్య శిబిరంను ఈ శుక్రవారం నిర్వహించనున్నారు.
శిబిరం వాసవి కన్యకాపరమేశ్వరి గుడి (సంత బజారు) దగ్గర ఏర్పాటు చేయబడింది.
కంటి సమస్యలతో బాధపడుతున్నవారు, ముఖ్యంగా కంటి ఆపరేషన్ అవసరమైన వారు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.
శిబిరంలో లభించే సేవలు:
🔹 కంటి పరీక్షలు ఉచితం
🔹 అవసరమైన వారికి ఉచితంగా కంటి మందులు
🔹 ఆపరేషన్ అవసరమైన వారికి 20% డిస్కౌంట్
🔹 కంటి అద్దాలు (చశ్మాలు) పై 50% డిస్కౌంట్
ఈ శిబిరం ద్వారా ఆర్యవైశ్య సమాజానికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి యాజమాన్యం, సంఘం ప్రత్యేకంగా ముందుకు వచ్చాయని తెలిపారు.
మరింత సమాచారం కోసం సంప్రదించండి:
📞 శ్రీ సాయి నేత్రాలయ కంటి ఆసుపత్రి, వనపర్తి
సెల్: 70755 49414
