కొత్తపల్లిలోని అల్ఫోర్స్ జూనియర్ కళాశాల లో విశ్వ వసు నామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉగాది పండుగ విశిష్టతను వివరించారు.

డా. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో ఉగాది ఒక గొప్ప సాంప్రదాయపూర్వక పండుగ అని, దీన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవడం అనేది సమాజానికి శోభను తెచ్చే విశేషం అని తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.

ఈ వేడుకల్లో అల్ఫోర్స్ విద్యా సంస్థల సిబ్బంది, శ్రేయోభిలాషులు పాల్గొని ఉగాది పండుగను ఘనంగా నిర్వహించారు.

