పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తా వద్ద హిందూ జాగృతం ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హిందూ జాగృతం ఏర్పాటు అయిన నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా, ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా హిందూ జాగృతం సభ్యులు మాట్లాడుతూ, మన గుడి – మన బాధ్యత కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని, అలాగే ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హిందూ జాగృతం సభ్యులు, పెబ్బేరు పట్టణ ప్రజలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఉగాది వేడుకలను విజయవంతంగా నిర్వహించారు.
