
తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మాతృశిశు సంక్షేమంతో పాటు ఐదేళ్లలోపు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తూ నేరుగా ప్రభుత్వ పాఠశాలలకు అనుసంధానం చేయాలని సూచించారు.
సమీక్షా సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు:
🔹 అంగన్వాడీలకు ఆధునిక సౌకర్యాలతో కొత్త భవనాలు నిర్మించాలి. సాంకేతికతతో కూడిన కంటైనర్ మోడళ్లను పరిగణలోకి తీసుకోవాలి. సౌర విద్యుత్, బ్యాటరీ బ్యాకప్‌తో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.
🔹 ప్రతి అంగన్వాడీ పిల్లవాడికి పౌష్టికాహారం అందించేందుకు ఎన్జీవోల సేవలు వినియోగించాలి. బాలామృతం ప్లస్ అందుబాటులో ఉంచాలి. జొన్న రొట్టెలను కూడా ఆహారంలో భాగంగా ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలించాలి.
🔹 గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల సంక్షేమానికి అంగన్వాడీ వర్కర్లు – ఆశా వర్కర్లు కలిసి పనిచేయాలి.
🔹 అనాథ పిల్లల విద్యా అవసరాల కోసం పాలిటెక్నిక్ మరియు ఏటీసీలలో ప్రవేశాలు కల్పించాలి. నైపుణ్య శిక్షణ కోసం సింగపూర్ కేంద్రాలకు పంపే వారిలో వారికి చోటు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.
🔹 వలస కార్మికులు నివసించే ప్రాంతాల్లో మొబైల్ అంగన్వాడీలు ఏర్పాటు చేయాలని, విశ్రాంత ఉద్యోగులు, ఐటీ వేతనదారులు అంగన్వాడీల్లో బోధన సేవలకు ముందుకు రావాలన్న సూచన.
🔹 తెలంగాణ ఫుడ్స్, విజయ డైరీ ఉత్పత్తులను పిల్లలకు అందించాలన్నారు.
🔹 వృద్ధుల సంక్షేమానికి కుటుంబ బాధ్యతల విషయంలో నిర్లక్ష్యం చూపే ఉద్యోగుల వేతనాల నుంచి వారి తల్లిదండ్రుల ఖాతాల్లో 10-15% నేరుగా జమ చేసే విధానాన్ని పరిశీలించాలని సూచించారు.
🔹 ట్రాన్స్జెండర్లకు ట్రాఫిక్ శాఖలో అవకాశాలు కల్పించామని, వీరి సేవలను ఇతర ప్రభుత్వ శాఖలు, ఐటీ సంస్థల్లో కూడా వినియోగించాలని ఆదేశించారు.
🔹 Telangana Rising 2047 డాక్యుమెంట్లో మహిళలు, చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక విధానాలు రూపొందించాలని సూచించారు.
🔹 దివ్యాంగుల పెళ్లిళ్లకు ప్రోత్సాహకాలు, పథకాల అమలుపై అధ్యయనం చేసి మంత్రిమండలి సమావేశానికి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
