
ఎన్కూర్, మే 22 (జిందగీ 9 న్యూస్ రిపోర్టర్: రాము నాయక్) : ఎన్కూర్ మండలంలోని మున్యా తండా గ్రామంలో హనుమాన్ జయంతిని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు హేమ, దేవ్‌సింగ్, బాలు, లాలు, రాము, నరసింహ, వీరు, వీరన్న, శివాజీ, పవన్, లక్ష్మణ్, కృష్ణ, దేవ్ తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం ప్రసాదం పంపిణీ చేశారు. గ్రామ యువత పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం.
