కరీంనగర్, మార్చి 29, 2025: కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు.
సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ ఎ. పురుషోత్తం , సెక్యూరిటీ గార్డు (అవుట్సోర్సింగ్) కె. శ్రీనివాస్ రెడ్డి అనే ఈ ఇద్దరు, ఓ హోల్‌సేల్ పండ్ల వ్యాపార కమిషన్ ఏజెంట్ లైసెన్స్ పునరుద్ధరణకు రూ. 60,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఫిర్యాదుదారుడి సమాచారం మేరకు, అధికారులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ బృందం మోహరించి వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు, నిందితులను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకుని తదుపరి చర్యలు చేపట్టారు. కరీంనగర్లో ఈ అవినీతి ఘటన కలకలం రేపింది.
