
రిటైర్డ్ డీఎస్పీ రామస్వామి కి నివాళులు అర్పించిన ఎసై ఆవుల తిరుపతి..
వీణవంక ప్రతినిధి,నవంబర్ 7(zindagi9news ):వీణవంక మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ డీఎస్పీ గడ్డం రామస్వామి అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ వార్త తెలుసుకున్న వీణవంక పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆవుల తిరుపతి, రామస్వామి నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహానికి పూలమాల అర్పించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.
