భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

జిందగీ9న్యూస్, అక్టోబర్ 24 (వైరా నియోజకవర్గ రిపోర్టర్: రామునాయక్):
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కాలనీ నాచారం గ్రామంలో భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే — ఆ గ్రామానికి చెందిన తాటి రామారావు, తాటి గోవర్ధన దంపతులు కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. అయితే ఇటీవల గోవర్ధనకు అదే గ్రామానికి చెందిన వ్యక్తితో అక్రమ సంబంధం ఉందన్న అనుమానం రామారావుకు కలిగింది.
ఈ విషయం పై పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో చర్చలు జరిగినా, భార్య తన ప్రవర్తనలో మార్పు చూపకపోవడంతో భర్త విసుగుచెంది, శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో గొడ్డలితో భార్యపై దాడి చేసి నరికి చంపాడు. అనంతరం హత్యకు ఉపయోగించిన గొడ్డలి తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయాడు.
మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఘటన స్థలానికి సీఐ వి.యం.బంజర , ఏన్కూర్ ఎస్సై ముత్తిలింగం, సంధ్య లు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
