
కరీంనగర్ : జాగృతిలో చేరిన ఉద్యమకారులు
కరీంనగర్ : జాగృతిని బలోపేతం చేయడంలో భాగంగా, జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో పలువురు నేతలు హైదరాబాద్‌లోని కేంద్ర జాగృతి కార్యాలయంలో జాగృతిలో చేరారు. వారికి జాగృతి అధ్యక్షురాలు కవిత స్వయంగా కండువాలు కప్పి ఆహ్వానించారు.
జాగృతిలో చేరిన వారిలో తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ యువజన విభాగం సీనియర్ నాయకుడు పెండ్యాల మహేష్, తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ మాజీ ఉపసర్పంచ్ బుడిద పర్షారం గౌడ్, తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు చంటి శ్రీనివాస్, బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు దెబ్బటి సూర్య, పెరుమండ్ల అభిషేక్, కరీంనగర్ బ్యూటీ అసోసియేషన్ సభ్యులు కోండ్ర శోభరాణి, మౌనిక తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ — కరీంనగర్లో జాగృతిని బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యమని, తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది త్యాగాలు చేసినా వారికి సరైన గుర్తింపు అందలేదని చెప్పారు. “రానున్న రోజుల్లో సామాజిక తెలంగాణ ఉద్యమకారులను కాపాడుకుంటాం, వారికి న్యాయం జరిగేలా చూస్తాం,” అని ఆమె అన్నారు.
జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా “జనం బాట” కార్యక్రమం ఈ నెల 25 నుండి ప్రారంభమవుతుందని, ఇందులో భాగంగా అక్టోబర్ 31 మరియు నవంబర్ 1 తేదీల్లో కరీంనగర్ జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, మేధావులు, నిరుద్యోగులు, వ్యాపార వర్గాలు, డాక్టర్లు, ఇంజనీర్లు, అడ్వకేట్లు పెద్దఎత్తున పాల్గొనాలని కవిత పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జాగృతి ఆరోగ్య విభాగం అధ్యక్షుడు మేకల తిరుపతి, రూప, విజయ, కొత్తూరి రఘు, శ్రీరాముల రమేష్, గర్షకుర్తి విద్యాసాగర్‌తో పాటు పలువురు మహిళలు, యువకులు పాల్గొన్నారు.
