
బాగున్నారా… అమ్మ?” – మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు
కాంగ్రెస్ మహిళా మంత్రులకు బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఆత్మీయ పలకరింపు చేశారు. గురువారం ఎర్రవెల్లి నివాసంలో ఆయనను మంత్రులు కొండా సురేఖ, సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇంటికి వచ్చిన ఆడబిడ్డలకు అతిథి మర్యాదలతో పసుపు కుంకుమలు, చీరలు, తాంబూలాలు ఇచ్చి సంప్రదాయ సత్కారం చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో, జాతరకు రావాల్సిందిగా ప్రభుత్వ తరఫున కేసీఆర్ను వారు ఆహ్వానించారు.
