మైనర్లతో అశ్లీల ఇంటర్వ్యూలు… యూట్యూబర్ అరెస్ట్
మైనర్లతో అశ్లీల ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ కంటెంట్ సృష్టిస్తున్న ఏపీకి చెందిన యూట్యూబర్ కంబేటి సత్యమూర్తిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.
‘వైరల్ హబ్ 007’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న సత్యమూర్తి, 15 నుంచి 17 ఏండ్ల బాలబాలికలను అసభ్య ప్రశ్నలు అడుగుతూ అనుచితంగా ప్రవర్తించినట్లు పోలీసులు గుర్తించారు. వ్యూస్ పెంచుకోవడానికే ఈ చర్యలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.
డిజిటల్ ఆధారాల ఆధారంగా నిందితుడిపై పోక్సో, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు.
