
పెబ్బేరు, జూన్ 17:
పెబ్బేరు మండలంలోని పెబ్బేరు గ్రామం 8వ అంగన్వాడీ కేంద్రంలో “అమ్మ మాట – అంగన్వాడీ బాట” కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాసం చేయించడంతో పాటు, 5 సంవత్సరాలు నిండిన పిల్లలను చెంచువాడ ప్రాథమిక పాఠశాలలో చేరుస్తూ అడుగులు వేయించడమైంది.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పెబ్బేరు ఇన్చార్జి సీడీపీఓ బాలీశ్వరి, సూపర్వైజర్ ఆసియా, చెంచువాడ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిన్నారాములు, మాధురి, అంగన్వాడీ టీచర్ రాధ పాల్గొన్నారు. అలాగే గర్భిణీ స్త్రీలు, బాలింతలు కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు.
చిన్నారుల్లో విద్యా చైతన్యాన్ని పెంపొందించేందుకు, విద్య ప్రారంభ దశలోనే స్ఫూర్తినిచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.
