
డోన్ పట్టణంలో సీఎస్ఐ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
డోన్ పట్టణంలోని సి ఎస్ ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ప్రార్థన కార్యక్రమం అనంతరం సీఎస్ఐ చర్చిలో ఎమ్మెల్యేను సీనియర్ జర్నలిస్ట్ విజయ్, రంగన్న గౌడ్, బీజేపీ నంద్యాల జిల్లా ఐటీ కన్వీనర్ అరబోలు వీరేష్ బాబు శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా క్రిస్మస్ పండుగ శాంతి, సౌభ్రాతృత్వం, ప్రేమ సందేశాన్ని సమాజానికి అందిస్తుందని వక్తలు తెలిపారు. కార్యక్రమంలో చర్చి సభ్యులు, స్థానిక నాయకులు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
