
మడిపల్లిలో ROB వంతెన నిర్మాణం: జిల్లా కలెక్టర్ కీలక సమావేశం
కరీంనగర్ : జమ్మికుంట మండలం మడిపల్లిలో ROB (Road Over Bridge) వంతెన నిర్మాణానికి సంబంధించి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి రైల్వే, రెవెన్యూ, నీటిపారుదల అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు.
కేంద్రం, రాష్ట్రం సంయుక్తంగా క్షేత్రస్థాయిలో జాయింట్ సర్వే నిర్వహించి భూసేకరణ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
ROB నిర్మాణానికి సంబంధించి స్థానిక, శాఖల సమన్వయం మరింత వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
