
జమ్మికుంట, జూన్ 11: జమ్మికుంట బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలో బుధవారం మండలంలోని అన్ని పాఠశాలల మధ్యాహ్న భోజన కార్మికులు, స్పెషల్ వర్కర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి హేమలత, ఆర్పీలు వేణుగోపాల్, రాజు, రాహుల్ పాల్గొన్నారు. వంట సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లలకు రుచికరమైన, పౌష్టికమైన ఆహారం అందించాల్సిన బాధ్యతలపై వివరించారు. వారానికి మూడుసార్లు గుడ్లు, రాగి జావా ఇవ్వాలన్నారు. టాయిలెట్లు ప్రతిరోజూ శుభ్రంగా కడగాలని, పిల్లలు ఇబ్బందిపడకుండా చూడాలని స్పెషల్ వర్కర్లకు సూచించారు.
