ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అడ్డగోలుగా అసత్యపూరిత వ్యాఖ్యలు చేసినందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసు పంపించారు. కేటీఆర్ న్యాయవాదులు పంపిన నోటీసులో, ఒక కేంద్రమంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మరొక ప్రజా ప్రతినిధిపై అసత్య ఆరోపణలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు.
కేవలం రాజకీయ ఉనికి కోసం కేటీఆర్‌పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని నోటీసులో పేర్కొంటూ, వెంటనే ప్రజా వేదికపై క్షమాపణ చెప్పాలని బండి సంజయ్‌ను డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అడ్డగోలు ఆరోపణలు చేయకుండా ఉండాలని హెచ్చరించారు. లేకుంటే తదుపరి నోటీసుతో పాటు చట్టపరమైన క్రిమినల్ చర్యలకు బండి సంజయ్ బాధ్యుడవుతారని న్యాయవాదులు స్పష్టం చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
