అక్కి వెంకటమ్మ జ్ఞాపకార్థంగా చీరల పంపిణీ

వనపర్తి: బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్కి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి కీర్తిశేషురాలు అక్కి వెంకటమ్మ ఏడవ వర్ధంతి సందర్భంగా, సోమవారం పెబ్బేరు మున్సిపాలిటీ 9, 10వ వార్డుల మహిళలకు 60 చీరలను పంపిణీ చేశారు. కుటుంబ సభ్యులు మాజీ సర్పంచ్ అక్కి సుశీల శ్రీనివాస్ గౌడ్, అక్కి మీనా బాబుగౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, “ఎన్ని జన్మలెత్తినా అమ్మ రుణం తీర్చుకోలేం” అని తెలిపారు. కార్యక్రమంలో వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యం, టౌన్ ఉపాధ్యక్షులు రజక నరసింహ, భగత్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
