పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామంలో ఆదర్శ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెబ్బేరు ఎస్ఐ యుగంధర్ రెడ్డి, APO రోజా, గ్రామ సెక్రటరీ మల్లయ్య, శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం ధర్మకర్త పుల్లూరు వెంకటేశ్వర్ రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ తేజ యాదవ్, మాజీ ఉపసర్పంచ్ భాస్కర్, వార్డు మెంబర్ బాల గౌడ్ హాజరయ్యారు.
క్లబ్ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, ఉపాధ్యక్షుడు రవికుమార్ రెడ్డి, వాకర్స్ బృందం సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు వేసవి కాలంలో శీతలపానీయాలు అందించేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
అతిథులు మాట్లాడుతూ, సమాజహితం కోసం వాకర్స్ క్లబ్ తీసుకున్న ఈ ఆచరణను ప్రశంసించారు. గ్రామస్థుల నుంచి మంచి స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు.
