నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని గోపాల్ నగర్ గ్రామంలో వెంకటకృష్ణ – సి.లక్ష్మీ ప్రభ దంపతుల కుమార్తె ఉష పుట్టినరోజు ను పురస్కరించుకుని, గ్రామంలో ఉన్న విద్యార్థులకు పుస్తకాలు, పెండ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం వారి కుటుంబ సభ్యుల సహకారంతో సదభిప్రాయంతో నిర్వహించబడింది.ఈ సందర్భంగా పలువురు గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపయోగపడే విధంగా నూతన విధానాన్ని చేపట్టిన ఉష కుటుంబాన్ని గ్రామస్థులు అభినందించారు. పుట్టినరోజు వేడుకను ఇలా సేవా కార్యక్రమంగా మార్చడం ప్రశంసనీయం అని పాల్గొన్న వారు తెలిపారు.
