
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన గుత్తికొండ అఖిలేష్ (22) ఆర్థిక ఒత్తిడితో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బీటెక్ పూర్తి చేసిన అతడు కాలేజ్ రోజుల్లోనే స్నేహితుల దగ్గర అప్పులు చేసి, తరువాత లోన్ యాప్ల ద్వారా డబ్బులు తీసుకున్నాడు. అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపానికి గురై, గురువారం ఉదయం ఇంట్లో ఉరివేసుకున్నాడు. తండ్రి గుత్తికొండ రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
