
వీణవంక, జూన్ 25 (జిందగీ 9 న్యూస్): కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బుధవారం రెడ్డిపల్లి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో 154 మందికి వైద్యులు డాక్టర్ లోకేష్ బీరకాయల పరీక్షలు చేశారు. అవసరమైన వారికి బీపీ, షుగర్, ECG వంటి పరీక్షలు నిర్వహించి రోగ నిర్ధారణ చేశారు. ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలందించాలన్న ఉద్దేశ్యంతో ఈ శిబిరం నిర్వహించామని తెలిపారు. ఈ శిబిరంలో నాయకులు బొంగోని ఎల్లయ్య గౌడ్, పోతుల నర్సయ్య, కోటకర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.
