
జమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి స్పందన అనాధ ఆశ్రమంలో గురువారం వినూత్నంగా జన్మదిన వేడుకలు జరిగాయి. బిజిగిరిషరీఫ్ గ్రామానికి చెందిన కండె శ్రీనివాస్, రమ్య దంపతుల కవల పిల్లలు శాన్వి, సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా మేనమామలు ఎర్ర ప్రదీప్, ఎర్ర జస్వంత్ ఆధ్వర్యంలో ఆశ్రమంలోని అనాధ పిల్లలకు పండ్లు, బ్రెడ్, పెన్నులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “మా అల్లుడు, కోడల పిల్లల జన్మదినాన్ని సామాజిక సేవ ద్వారా ప్రత్యేకంగా జరుపుకోవడం ఎంతో సంతృప్తిని ఇస్తోంది. అనాధ పిల్లల ముఖాల్లో చిరునవ్వులు చూడగలగడం మాకు గొప్ప ఆనందం” అని తెలిపారు.
సామాజిక స్పృహతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు.
