
అట్టహాసంగా సి సి రోడ్ & సీఎంఆర్ చెక్కుల పంపిణీ
జూలూరుపాడు, సెప్టెంబర్ 24 (జిందగీ 9న్యూస్):
వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ జూలూరుపాడు మండలంలో విస్తృత పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఐదు కోట్ల నిధులతో సిసి రోడ్, డ్రైనేజ్, ఫార్వర్డ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కాకర్ల గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
తరువాత దిద్దుపూరి గోపి దశకర్మలకు హాజరై కుటుంబానికి సానుభూతి తెలిపారు. అనంతరం అర్హులైన వారికి కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ “కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం. రైతులకు పెట్టుబడి సహాయం, రుణమాఫీ, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లతో ప్రతి మహిళకు సొంత ఇంటి కల నెరవేర్చింది. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతారని విశ్వసిస్తున్నాను” అని అన్నారు.
కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పువ్వాళ దుర్గాప్రసాద్, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, ఎంపిటిసి మధుసూదన్, రామశెట్టి రాంబాబు, మండల అధ్యక్షుడు మంగీలాల్, లేళ్ల గోపాల్ రెడ్డి, కాసిరాం తదితరులు పాల్గొన్నారు.
