
హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖాన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
హుజూరాబాద్ : ప్రభుత్వ దవాఖానలో కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకంలో భారీ అక్రమాలు జరిగాయని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్‌రావు ఆరోపించారు. సూపర్వైజర్, పేషంట్‌కేర్, సెక్యూరిటీ గార్డ్ వంటి ఉద్యోగాలకు అర్హతలేని వ్యక్తులను వేల రూపాయలు తీసుకుని నియమించారని ఆయన తెలిపారు. దీంతో రోగులను పట్టించుకోకుండా భయపెట్టి ప్రైవేట్ ఆసుపత్రులకు పంపి పేద ప్రజలను మోసం చేశారని, ప్రైవేట్ హాస్పిటల్స్‌తో కుమ్మక్కై లక్షల రూపాయల కమిషన్లు తీసుకున్నారని విమర్శించారు.
ఈ విషయం బయటపడడంతో జిల్లా కలెక్టర్ విచారణ జరిపి 20 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని కానీ ఉద్యోగాల కోసం డబ్బులు వసూలు చేసిన కాంట్రాక్టర్‌పై మాత్రం చర్యలు తీసుకోలేదని సంపత్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. పేద రోగులను నష్టపరిచిన కాంట్రాక్టర్‌పై వెంటనే చర్యలు తీసుకొని కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
