
ఇల్లంతకుంటలో దొంగతనం – రూ.2.5 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు
కరీంనగర్ జిల్లా, ఇల్లంతకుంట మండలం గాంధీనగర్ (హెచ్) మల్యాల గ్రామానికి చెందిన గూడెపు మల్లమ్మ (60) ఇంట్లో దొంగతనం జరిగింది. సెప్టెంబర్ 23 ఉదయం సుమారు 10 గంటలకు మల్లమ్మ ఇంటి వరండా పక్కన గదిలో తలుపులు తెరిచి ఉండటం గమనించి అనుమానంతో లోపలికి వెళ్లి చూసే సరికి బీరువా పగులగొట్టి లోపల దాచిన రూ.2,50,000 నగదు మాయం అయినట్లు తెలిసింది.
ఈ ఘటనపై మల్లమ్మ ఫిర్యాదు మేరకు ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఎం. క్రాంతి కుమార్ కేసు నమోదు చేశారు. జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, ఇల్లంతకుంట ఎస్ఐలతో కలిసి సంఘటన స్థలాన్ని ఫింగర్ ప్రింట్ విభాగం సాయంతో క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
