హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఎల్ఓసిలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే తుడిమేగారెడ్డి

పెబ్బేరు, జూలై 15: వనపర్తి శాసనసభ్యుడు తుడిమేగారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెబ్బేరు మండలానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు హాస్పటల్ ఖర్చుల నిమిత్తం ఎల్ఓసిలు (LOCs) పంపిణీ చేశారు.
1. జ్ఞానదీపి గౌడ్ (కొత్తూరు గ్రామం) – రూ. 1,00,000
2. వాసు (పెబ్బేరు నివాసి) – రూ. 75,000
లబ్ధిదారులకు వైద్య అవసరాల కోసం ఆర్థిక సహాయం అందించినందుకు తుడిమేగారెడ్డి కుటుంబానికి లబ్ధిదారుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్ యుగంధర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు రామన్ గౌడ్, మోతే రాములు, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
