
సిపిఎం అభ్యర్థులను గెలిపించండి: భూక్య వీరభద్రం
జిందగీ9న్యూస్, అక్టోబర్ 04 (వైరా నియోజకవర్గ రిపోర్టర్ రాము నాయక్)
ఏన్కూరు మండలంలో సిపిఎం మండల కమిటీ సమావేశం ఇటికాల లెనిన్ అధ్యక్షతన సిపిఎం కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం హాజరై మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం పార్టీ ఏన్కూరు మండలంలోని 10 ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానంలో కూడా పోటీ చేస్తోందని ఆయన తెలిపారు. అభ్యర్థులు కూడా ఇప్పటికే ఖరారయ్యారని ఆయన వెల్లడించారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, ప్రజల కోసం నిజాయితీగా పోరాడే అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. “రాష్ట్రంలో ఒక పార్టీలో గెలిచిన వ్యక్తులు డబ్బుకోసం గంటలోనే మరొక పార్టీలో చేరిపోవడం దుర్మార్గమైన చర్య” అని ఆయన విమర్శించారు.
కార్మికుల హక్కులు, వేతనాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న సిపిఎం పార్టీనే ప్రజల నిజమైన మిత్రమని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి దొంత బైన నాగేశ్వరరావు, భూక్య రాములు, కూరపాటి నరసింహారావు, ఎల్లూరి రామచంద్రరావు, వెంకటేశ్వర్లు, కిలారి నాగరాజు, కాల్ సాని సాయి, షేక్ జానీ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
