
ఉపాధ్యాయుడి బదిలీపై గ్రామస్తుల నిరసన
జిందగీ9న్యూస్, అక్టోబర్ 04 (వైరా నియోజకవర్గ రిపోర్టర్ రాము నాయక్)
ఏన్కూరు మండలంలోని తిమ్మారావుపేట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు చంద్రశేఖర్‌ను డిప్యూటేషన్‌పై కొత్త మేడిపల్లికి బదిలీ చేయడంపై గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
సుమారు 60 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో ప్రస్తుతం ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. వారిలో ఒకరిని బదిలీ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాఠశాల ముందు నిరసన చేపట్టారు.
చంద్రశేఖర్ కారణంగా పాఠశాల అభివృద్ధి సాధించిందని, విద్యార్థుల హాజరు పెరిగిందని, ఆయన బోధనతో పిల్లలు చక్కగా చదువుతున్నారని గ్రామస్థులు పేర్కొన్నారు. ఆయనను వెంటనే తిరిగి తిమ్మారావుపేట పాఠశాలకు రప్పించాలని వారు డిమాండ్ చేశారు.
