ఇల్లందకుంట, ఏప్రిల్ 22 : కరీంనగర్ జిల్లా, ఇల్లందకుంట మండలం & గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో 2025 శ్రీరామనవమి జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా వేసిన హుండీల లెక్కింపు మంగళవారం నిర్వహించారు.
ఈ లెక్కింపు ద్వారా మొత్తం రూ. 20,69,829/- ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా 12 గ్రాముల మిశ్రమ బంగారం, 305 గ్రాముల మిశ్రమ వెండి, విదేశీ కరెన్సీగా 225 అమెరికన్ డాలర్లు, 15 అరబ్ దిర్హామ్‌లు, 1 కువైట్ దినార్, 5 చైనా యువాన్లు, 1000 జపాన్ యెన్లు లభించాయి.
గత సంవత్సరం హుండీ ఆదాయంతో పోల్చితే ఈ సంవత్సరం రూ. 2,94,257/- అధికంగా వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఈ లెక్కింపు కార్యక్రమం పి. సత్యనారాయణ, (పరిశీలకులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ, కరీంనగర్ డివిజన్) పర్యవేక్షణలో కె. సుధాకర్, (కార్యనిర్వాహణాధికారి), రీనోవేషన్ కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులతో కలిసి విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మరియు సిబ్బంది, మడిపల్లి వాలంటీర్లు, శ్రీ రాజరాజేశ్వరీ సేవా సమితి – జమ్మికుంట సభ్యులు, భక్తులు పాల్గొని సహకరించారు.
– Zindagi9News
