
జమ్మికుంట : జిల్లా పరిషత్ (బాలురు) ఉన్నత పాఠశాలలో శుక్రవారం అమెరికన్ ఇండియా ఫౌండేషన్, అమెజాన్ సంయుక్తంగా నిర్వహించిన వేసవి శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మండల తహసీల్దార్ రి. వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎం.డీ. ఆయాజ్, మండల విద్యాధికారి ఎం. హేమలత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
విద్యార్థులు శిక్షణా తరగతులలో నేర్చుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫైథాన్ ప్రోగ్రామింగ్ అంశాలను ప్రదర్శించారు. ఉత్తమ ప్రదర్శన చేసిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు.
ZPHS వెన్కెంపల్లికి చెందిన మునిపాల అమూల్య – ప్రథమ బహుమతి
ZPHS (బాలురు) జమ్మికుంటకు చెందిన ఎం.డి. ఫాతిమా – ద్వితీయ బహుమతి
ZPHS అగొడిశాలకి చెందిన బి. అమ్మక – తృతీయ బహుమతి
గెలుచుకున్నారు.
ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న విద్యార్థులందరికీ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. రవీందర్ రెడ్డి, ఫౌండేషన్ కోఆర్డినేటర్ మహమ్మద్ ఒమర్, కోఆర్డినేటర్లు షేక్ హబీబ్, పి. నాగరాజు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
