భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి పోచమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి 20 వేల రూపాయల విరాళం

వీణవంక,జూన్ 5(zindagi9news):
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బొంతుపల్లి గ్రామంలో జరుగుతున్న భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి పోచమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా YuppTV & Turito సంస్థల స్థాపకులు మరియు సీఈఓ పాడి ఉదయ్ నందన్ రెడ్డి విరాళంగా రూ.20,000 అందజేశారు.
ఈ విరాళాన్ని ఆయన అనుచరుల చేత గ్రామస్థులకు అందజేయగా, బొంతుపల్లి గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ దసారపు ప్రభాకర్, మాజీ సర్పంచ్ మహంకాళి రాజ్ కుమార్, చదువు మహేందర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, జున్నుతుల జనార్దన్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి, నరహరి మల్లారెడ్డి, నల్లగోని రమేష్ గౌడ్, మర్రి శ్రీనివాస్, బావు సంపత్, వెన్నంపల్లి నారాయణ, అమృత ప్రభాకర్, సమ్మండ్ల చిట్టి, దసారపు లోకేష్, వంశీకృష్ణ, తాళ్లపెల్లి కుమారస్వామి, మహంకాళి రాజు సహా గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈ మహోత్సవం భక్తి శ్రద్ధలతో కొనసాగుతుండగా, పాడి ఉదయ్ నందన్ రెడ్డి చేసిన విరాళం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.
