
వీణవంకలో మహాఅన్నదాన కార్యక్రమం
వీణవంక మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాల భాగంగా ఆదివారం మధ్యాహ్నం మహాఅన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ మహాఅన్నదాన ధాతగా పాడి శిరీష – పాడి ఉదయ్ నందన్ రెడ్డి (Founder & CEO – YuppTV & Turito) వ్యవహరించారు. ఈ సందర్భంగా వీణవంక గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
