
పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని వనపర్తి రోడ్, జమే మసీదు లైన్ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిచేసినప్పటికీ, తుది స్థాయిలో లెవెలింగ్ పనులు చేయకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గత రెండు మూడు నెలలుగా రోడ్డు మట్టి మరియు నీరు నిలిచిపోయే స్థితిలో ఉండటంతో వర్షాలు పడినప్పుడు మరింతగా నీరు నిలిచిపోయి చిన్న బావిలా మారిపోతుంది. ఇందువల్ల రోడ్డుపై నడవడమే కష్టంగా మారింది. ప్రత్యేకంగా నమాజ్‌కు మసీదు వద్దకు వచ్చే ముస్లిం సోదరులు ఈ ఇబ్బందిని ఎక్కువగా ఎదుర్కొంటున్నారు.
ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు, పట్టణ ప్రజలు కోరుతున్నారు. రోడ్డు పునరుద్ధరణ, నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచే చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
