
టేకుమట్ల మండలం వెలిశాల గ్రామంలో మావోయిస్టు నాయకుడిగా చురుకుగా పనిచేసిన గాజర్ల రవన్న అలియాస్ గాజర్ల గణేష్ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి పరామర్శించారు. ఇటీవల మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో గణేష్ మృతిచెందిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా గండ్ర వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ – “భూస్వామ్య వ్యవస్థను వ్యతిరేకిస్తూ అజ్ఞాత జీవితాన్ని గడిపిన రవన్న పేదల కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. ఆయన చూపిన పోరాట స్ఫూర్తి ఎన్నో మందికి మార్గదర్శకం అవుతుంది. అతని త్యాగం వృధా కాదని భావిస్తున్నాం,” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో టేకుమట్ల మండల అధ్యక్షుడు సట్ల రవి గౌడ్, మాజీ ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, బందెల నరేష్, మాజీ ఎంపిటిసి పింగిలి వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచులు నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్, నల్లబెల్లి రవీందర్, పొన్నం చంద్రయ్య గౌడ్, పిఎసిఎస్ మార్కెట్ డైరెక్టర్ దొడ్డకోటి, గువ్వాడి లక్ష్మణ్, కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ అఫ్జల్, యువ నాయకులు మహమ్మద్ అక్రమ్, చేలకాని రాకేష్, దేవేందర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
