వనపర్తి, మార్చి 04 (Zindagi9News ప్రతినిధి):
వనపర్తి జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ (IPS) తెలిపారు. ఈ నెల మార్చి 1 నుండి 31 వరకు ఈ నియమావళి కొనసాగనుంది.
ఎస్పీ హెచ్చరిక:
✅ పోలీసు అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు నిషేధం
✅ ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ఫంక్షన్ హాల్లో కార్యక్రమాలకు పరిమితులు
✅ అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు
జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలుగా ఈ ఆదేశాలు అమలవుతున్నాయి. పోలీసులు ఎవరైనా నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.
ప్రజలు, సంస్థలు, రాజకీయ పార్టీలు అనుమతులు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ గిరిధర్ సూచించారు.
