హుజురాబాద్, మార్చి 04 (Zindagi9News ప్రతినిధి):
హుజురాబాద్ డివిజన్ మస్జీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మసీదుల్లో పనిచేస్తున్న ఇమామ్, మౌజాన్లకు బకాయిలుగా ఉన్న నాలుగు నెలల జీతాలను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, మైనార్టీ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, మైనారిటీ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఇక్బాల్, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్లను కోరారు.
రంజాన్‌కు ముందే అందాల్సిన సాయం
✅ ఇమామ్, మౌజాన్లకు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను తక్షణమే చెల్లించాలి.
✅ ముస్లింలకు రంజాన్ దావత్ (ఇఫ్తార్) విందు, గిఫ్ట్ ప్యాకెజ్ పంపిణీ మార్చి 20 లోపు నిర్వహించాలి.
✅ రంజాన్ చివరి 10 రోజులు ముస్లింలకు ప్రత్యేకమైనవి. అందుకే ఈ కార్యక్రమాలను ముందుగా పూర్తి చేయాలి.
“రంజాన్ పవిత్ర నెలలో ముస్లింలు ఉపవాసం ఉంటారు. ప్రభుత్వ సహాయం అందుబాటులోకి రాకపోతే మౌజాన్, ఇమామ్ కుటుంబాలు ఇబ్బంది పడతాయి” అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పేర్కొన్నారు.
ఈ విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
