
వనపర్తి, జూలై 8:తెలంగాణ రాష్ట్ర ప్రజల శాంతి, సౌభాగ్యం, పాడిపంటల అభివృద్ధి కోసం హైదరాబాదులో నిర్వహించనున్న పంచకుండాత్మక చండీ, కుబేర, పాశుపత మహా యాగానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘ మేఘారెడ్డికి ఆహ్వానం అందజేశారు.
ఈ మహా యాగం జూలై 14 (సోమవారం) నుండి జూలై 16 (బుధవారం) వరకు హైదరాబాద్ కాచిగూడలోని శ్రీ తుల్జాభవన్ ధర్మశాల, (టూరిస్టు హోటల్ ఎదురుగా) నందు జరుగనుంది. ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో ఈ యాగం వైభవంగా నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
ఈ నేపథ్యంలో వనపర్తి జిల్లా అర్చక సంఘం అధ్యక్షులు పీ.వీ. లక్ష్మీకాంత ఆచార్యులు, ప్రధాన కార్యదర్శి ఎం. రవీందర్ రావు, ఉపాధ్యక్షులు జె. నటరాజ్ కలిసి ఎమ్మెల్యే మేఘ మేఘారెడ్డిని కలిసి యాగానికి ఆహ్వాన పత్రికను అందించారు.
ఈ యాగం ద్వారా రాష్ట్రంలోని పాలకులు, కర్షకులు, కార్మికులు మరియు సమస్త ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించనున్నట్టు వారు తెలిపారు.
