
ములుగు జిల్లా విద్యాశాఖలో అవినీతి కలుషిత వ్యవహారం వెలుగులోకి వచ్చింది. “ఉద్యోగంలో చేరేందుకు ఇచ్చిన వినతిపత్రాన్ని స్వీకరించడం మరియు తదుపరి విధుల్లో చేరేందుకు ఆదేశాలు జారీ చేయడం” కోసం ఫిర్యాదిదారుని నుండి రూ.20,000/- లంచం డిమాండ్ చేసి స్వీకరించిన ఘనత ములుగు జిల్లా విద్యాశాఖాధికారి గొర్ల పాణిని, కార్యాలయంలోని ఎస్టాబ్లిష్మెంట్ విభాగంలో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ తొట్టె దిలీప్ కుమార్ యాదవ్కు దక్కింది.
ఈ అవినీతి చర్యను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సోదాలు నిర్వహించి పట్టుకున్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అనిశా అధికారులు డబ్బు స్వీకరిస్తున్న సమయంలో వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన విద్యాశాఖలో అవినీతి పట్ల ఉన్న తీరును మరోసారి నిరూపించింది. విచారణ కొనసాగుతోందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో పారదర్శకత కోసం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని సామాన్యులు అభిప్రాయపడుతున్నారు.
