
హైదరాబాద్, జూన్ 17 (జిందగి 9న్యూస్):
పని పూర్తయిన తరువాత కొలతల పుస్తకంలో నమోదు చేసేందుకు అధికారిక సహాయం చేస్తానని చెప్పి రూ.1,20,000/- లంచం తీసుకుంటూ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి చెందిన ఓ అధికారి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.
ఈ ఘటన కాప్రా సర్కిల్-1 కార్యాలయంలో చోటుచేసుకుంది. అక్కడ పనిచేస్తున్న సహాయక కార్యనిర్వాహక ఇంజనీర్ బి. స్వరూప లంచం తీసుకుంటుండగా ACB అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
ఫిర్యాదుదారుడు పూర్తి చేసిన పనికి సంబంధించిన వివరాలు కొలతల పుస్తకంలో నమోదు చేయాల్సి ఉండగా, ఇందుకోసం స్వరూప రూ.1.20 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
