ప్రత్యేక నివేదిక – Zindagi9News
కరీంనగర్, ఏప్రిల్ 24 : జిల్లాలోని అనేక మెడికల్ షాపుల్లో బిల్ లేదా రిసీట్ ఇవ్వకుండా మందులు విక్రయం జరుగుతోందన్న ఆరోపణలు ప్రజల్లో ఆందోళనకు దారి తీస్తున్నాయి. రోగులు మెడికల్ షాపులకు వెళ్లినపుడు, రిసీట్ అడిగితే చాలా చోట్ల అందించకపోవడమన్నది ఒక సాధారణ ధోరణిగా మారుతోంది.
“ఇది చిన్న మందే”, “ఇలాంటివి కి రిసీట్ అవసరం లేదు”, “క్యాష్ బిల్లు మాత్రమే ఇస్తాం” అంటూ తప్పించుకుంటున్న షాపుల వ్యవహారం ప్రజల ఆరోగ్య భద్రతను కూడా ప్రశ్నార్థకంగా మార్చుతోంది.
డ్రగ్ కంట్రోల్ నిబంధనలు మరియు GST చట్టం ప్రకారం, ప్రతి మెడికల్ షాపు:
🔹ప్రతి మందుకు రిసీట్ / బిల్ ఇవ్వడం తప్పనిసరి
🔹లైసెన్స్ ఉన్న ఫార్మసిస్టు ద్వారా మాత్రమే విక్రయం జరగాలి
🔹విక్రయ రికార్డులు డాక్యుమెంటెడ్గా ఉండాలి
అయితే చాలాచోట్ల ఈ నిబంధనలు కేవలం కాగితాల మీదే పరిమితమవుతున్నట్లు కనిపిస్తోంది. రిసీట్ ఇవ్వకుండా మందులు అమ్మటం వల్ల ప్రజలకు తిరిగి ట్రీట్మెంట్ సమయంలో మందులను గుర్తించడం కష్టమవుతుంది. ఇది పబ్లిక్ హెల్త్‌కు ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రజలు ఈ విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, Zindagi9News ద్వారా ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు:
“ప్రతి మెడికల్ షాపును తనిఖీ చేసి, రిసీట్ లేకుండా మందుల విక్రయం చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలి.”
Zindagi9News – ప్రజల మాటలకు ప్రతిధ్వని
ఈ సమస్యపై మీ అభిప్రాయాలను పంపండి:
Email: zindagi9news@gmail.com | WhatsApp: 9908440211
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
