ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని ఆరోగ్య ఉప కేంద్రాలలో వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ వావిలాల గ్రామంలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవం నిర్వహించబడుతుందని తెలిపారు. మలేరియా వ్యాధి నిర్మూలన మరియు ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం.
2008 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం నిర్వహించబడుతుంది. మలేరియా వ్యాధి సాధారణంగా దోమ కాటుతో వ్యాప్తి చెందుతుంది. అయితే, అన్ని దోమలు మలేరియాను వ్యాప్తి చేయవు. కేవలం అనోఫిలస్ (Anopheles) జాతి ఆడ దోమల వల్ల మాత్రమే మలేరియా వ్యాధి మనుషులకు సోకుతుంది.
మలేరియా లక్షణాలు:
🔸జ్వరం, చలిగా ఉండటం
🔸వాంతులు, వికారం
🔸ఒంటినొప్పులు, తలనొప్పి
🔸దగ్గు, డయేరియా
🔸రక్తహీనత (Anemia), మెదడులో రక్త నాళాల విచ్ఛిత్తి
మలేరియా వ్యాధి నివారణకు:
🔹దోమ తెర ఉపయోగించండి
🔹దోమ మందులను ఇంట్లో కొట్టండి
🔹తలుపులు, కిటికీలకు దోమల నెట్లు బిగించండి
🔹ఫ్యాన్లు, ఎ.సి.లు ఉపయోగించండి
🔹శరీరాన్ని కప్పే లేత రంగు బట్టలు ధరించండి
🔹దోమలకు గుట్టలు ఉండే ప్రాంతాలకు వెళ్లకూడదు
🔹నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోండి
ఈ ర్యాలీలో వైద్యులు డాక్టర్ చందన, డాక్టర్ హిమబిందు, డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ సంధ్య, డాక్టర్ ఫర్హానుద్దీన్, డాక్టర్ కార్తీక్, డాక్టర్ విజయ్, సూపర్వైజర్స్ రత్నకుమారి, అరుణ, కుసుమ, కుమారి సదానందం, హెల్త్ అసిస్టెంట్ నరేందర్ మరియు ఆరోగ్యశాఖ సిబ్బంది ఆశాలు తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
