విద్యార్థులకు ప్రాథమిక దశ నుండే సామాజిక అవగహాన పట్ల ప్రత్యేక శ్రద్ద ఉండాలని మరియు తద్వారా వారు అందులో నిపుణులు అవుతారని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి.నరేందర్ రెడ్డి స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో బుధవారం ఏర్పాటు చేసినటువంటి విద్యార్ధుల అభినందన సభ కు ముఖ్య అతిధిగా హాజరై వారు మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్ పట్ల అవగాహన కల్పించడమే కాకుండా వాటిలోని అంశాలను సమగ్రంగా విద్యార్థులకు విశ్లేష్ణాత్మకంగా తెలుపాలని తద్వారా వివిద అంశాల పట్ల అవగాహన పెరుగుతుందని మరియు పోటీ పరీక్షలలో పాల్గొనడానికై విశ్వాసం కల్గుతుందని చెప్పారు.
విద్యార్థులకు తరగతి గదుల్లో ప్రతి అంశం గురించి చాలా అవగాహన కల్పిస్తామని మరియు విషయాలను తెలియపర్చడం జరుగుతుందని చెప్పారు. పాఠశాలలో ఇచ్చిన ప్రోత్సాహంతో వివిధ పోటీ పరీక్షలకు ఎంపిక చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో ఇటీవల కాలంలో యూనిఫైడ్ కౌన్సిల్ వారు నిర్వహించిన జాతీయ స్థాయి జి.కె. ఒలంపియాడ్లో పాఠశాలకు చెందిన బి. విహార్ 4వ తరగతి, వి. విహాన్ శౌరి 4వ తరగతి, ఎ. అక్షయగ్న 6వ తరగతి, డి. సమ్మితా రెడ్డి, 6వ తరగతి, యం. శివేన్ రెడ్డి, 7వ తరగతి, వి. జయంత్ క్షెత్రజ్ఞ 8వ తరగతి మరియు ఇ. ఆరుష్ పటేల్ 9వ తరగతి పతకాలు సాధించి పై చేయి సాధించారని హర్షం వ్యక్తం చేస్తు ప్రాంగణంలో ఏర్పాటుచేసినటువంటి సభలో శుభాభినందనలు తెలియజేశారు.ఈ సమావేశంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
