
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
పెబ్బేరు, ఆగస్టు 29: పెబ్బేరు మున్సిపాలిటీ 7వ వార్డుకు చెందిన అమరచింత చాకలి రాముడు శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిన వనపర్తి జిల్లా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్కి శ్రీనివాస్ గౌడ్ మృతదేహానికి పూలమాలలు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
ఈ సందర్భంగా మార్కెట్ డైరెక్టర్ మోతే రాములు, మాజీ డైరెక్టర్ రాములు, గుండ్రటి నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
