
బురదలోనే బాట – సీతారామ బ్రిడ్జి వద్ద ఇబ్బంది పడుతున్న వాహనదారులు
నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం
ఏన్కూర్, అక్టోబర్ 13 (Zindagi9News రిపోర్టర్: రాము నాయక్): ఏన్కూర్ నుండి రేపల్లెవాడకు వెళ్లే ప్రధాన మార్గంలో సీతారామ బ్రిడ్జి వద్ద వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి మొత్తం బురదతో నిండిపోవడంతో వాహనాలు కదలడమే కష్టంగా మారింది. మోకాళ్ల లోతు గుంటలు ఏర్పడి, రెండు చక్రాల వాహనాలు జారిపడే ప్రమాదం నెలకొంది.
రాత్రివేళల్లో ఈ మార్గం మరింత ప్రమాదకరంగా మారుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, సంబంధిత అధికారుల గమనిక లోపం వల్ల ఈ దుస్థితి నెలకొన్నదని స్థానికులు మండిపడుతున్నారు.
తక్షణమే రహదారి మరమ్మత్తులు చేపట్టి, సురక్షితంగా మార్గాన్ని అందుబాటులోకి తేవాలని వాహనదారులు, ప్రజలు అధికారులను కోరుతున్నారు.
