బిఆర్ఎస్ చేతగానితనంతోనే ఇన్ని సమస్యలు.
ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు.
రాజకీయ సన్నాసుల మాటలు విని ఎవరు అధైర్య పడవద్దు.
ప్రజా ప్రభుత్వ ఆదరణ చూసి బిత్తరపోతున్న బిఆర్ఎస్ నాయకులు.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్.
పది సంవత్సరాల పాలనలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేతగానితనం తో పేదల సంక్షేమాన్ని విస్మరించడం వల్లే నేడు గ్రామాల్లో ఇన్ని సమస్యలకు కారణమని,కాంగ్రెస్ పార్టీ టేకుమట్ల మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి అవకతవకలకు అవకాశం కల్పించకుండా నిజమైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందని, ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవని ఎవరు అనవసరంగా ఆందోళనలు చెందవద్దని ప్రజలను కోరారు. గ్రామ సభల వద్ద ప్రజలను రెచ్చగొడుతున్న టిఆర్ఎస్ నాయకులు ఈ 10 సంవత్సరాలు పేద ప్రజలకు ఎందుకు ఇల్లు కట్టించలేదో,ఎందుకు రేషన్ కార్డు లు మంజూరు చేయలేదో,భూమిలేని నిరుపేదలకు ఆర్థిక సాయం ఎందుకు చేయలేదో ఆత్మ విమర్శన చేసుకోవాలన్నారు.
మీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే ఈ 10 సంవత్సరాలు ప్రజా సంక్షేమాన్ని వచ్చేసేవారని,ఇప్పుడు ఏదో మీరు రాజకీయలబ్దికోసం రెచ్చగొడితే ఎవరు నమ్మరని అన్నారు.
సంక్షేమ పథకాల ఎంపిక అనేది పూర్తిగా ప్రజాక్షేత్రంలో నిజమైన లబ్ధిదారులకే అందించాలనే ఉద్దేశంతో కొంత ఆలస్యం అవుతుందన్నారు.
అలాగే ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం మేరకు, ఆధార్ కార్డు ఆధారంగా ప్రజల ఆర్థిక స్థితిగతులను గుర్తిస్తూ సంక్షేమ పథకాలకు ఎంపిక జరుగుతుందని అందులో కొంత టెక్నికల్ సమస్య వల్ల కొందరి పేర్లు మిస్ అవ్వడం జరిగిందన్నారు. వారి నుండి దరఖాస్తులు తీసుకొని అధికారుల సమక్షంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిరంతర ప్రక్రియ అని ఒక రోజుతోనే చేతులు దులుపుకునేది కాదని అన్నారు.
ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసి రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిస్థాయిలో నిర్మూలించాలనేది ఇందిరమ్మ లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా అమలు చేసి తీరుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నాంపల్లి వీరేశం,జిల్లా వివర్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు అడేపు సంపత్,మండల ప్రధాన కార్యదర్షులు బండి రవీందర్,ఎడ్ల రమేష్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ఐలయ్య,మండల నాయకులు కోయల చిరంజీవి, వంగ నరేష్,మంద రవి,ఎంబడి రాయమల్లు, బొల్లి పైడి,ఎండి ఫరూక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు…
