భూపాలపల్లి నియోజకవర్గంలోని టేకుమట్ల మండలంలో ఇటీవల మరణించిన వారి కుటుంబాలను భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వెల్లంపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఓరుగంటి సధాకర్, శేఖర్ గౌడ్ మాతృమూర్తి కీ.శే ఓరుగంటి భూలోకమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే, రామకిష్టాపురం(టి) గ్రామానికి చెందిన కీ.శే మొకిడి పూల, కీ.శే మొకిడి సంధ్యారాణి, కీ.శే మొండయ్య, కీ.శే సాద నరసింహ రాములు, నిమ్మల ముండయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా గండ్ర వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ, కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టేకుమట్ల మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సట్ల రవి గౌడ్, ఉపాధ్యక్షుడు బొడ్డు సదానందం, మాజీ ఎంపీపీ బందెల నరేష్, మాజీ ఎంపీటీసీ ఆది రఘు, మాజీ సర్పంచ్ ఉద్ధమారి మహేష్, యాదవ్ పొన్నం చంద్రయ్య, మాజీ ఉపసర్పంచి నిమ్మల స్వామి, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
