హుజురాబాద్: పట్టణ నడిబొడ్డున ఒకే రోజు, ఒకే సమయంలో రెండు వేర్వేరు దుకాణాలలో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. రెండు చోట్ల రూ. 25,000 నగదు, ఐదు తులాల వెండి, ఇతర విలువైన సామాను మాయమైనట్లు బాధితులు తెలిపారు.
చోరీ వివరాలు:
➡ అన్నపూర్ణ థియేటర్ చౌరస్తా: పోరండ్ల సమ్మయ్య కు చెందిన రాఘవేంద్ర కిరాణం అండ్ జనరల్ స్టోర్ షట్టర్ తాళాలు పగలగొట్టి దొంగలు దుకాణంలో చొరబడి, రూ. 25,000 నగదు మరియు ఇతర కిరాణా వస్తువులు అపహరించుకున్నారు.
➡ వరంగల్ రోడ్: దేవి సిల్క్స్ పక్కన ఉన్న పరమేశ్వర ఎలక్ట్రికల్ అండ్ వైన్డింగ్ షాప్ లో షట్టర్ తాళాలు తీసి లోపలికి ప్రవేశించి, రూ. 25,000 నగదు, ఐదు తులాల వెండి దొంగిలించినట్లు షాప్ యజమాని భగవాన్ రెడ్డి తెలిపారు.
సీసీ కెమెరాలో దొంగల కదలికలు:
➡ ఎలక్ట్రికల్ షాప్ వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలో దొంగలు తాళాలు తెరిచే దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి.
➡ చోరీ సమయం:
ఎలక్ట్రికల్ షాప్: 3:30 AM
కిరాణా షాప్: 2:30 AM
రాత్రి పోలీసుల గస్తీ ఉన్నప్పటికీ, పట్టణ ప్రధాన రహదారిలో, బస్టాండ్ పక్కనే ఉన్న దుకాణాలలో గంట వ్యవధిలో జరిగిన ఈ చోరీలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.
పోలీసుల స్పందన:
➡ సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ లను స్వాధీనం చేసుకుని, బాధితుల ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
➡ వరుసగా రెండు చోట్ల చోరీ జరగడంతో పట్టణ వ్యాప్తంగా ఉల్లిక్కిపాటు నెలకొంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
